సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి
హొసపేటె: దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, దేశంలో పాఠశాలలు నిర్మించి విద్యను అందించిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే సమాజానికి చేసిన సేవలు మరువలేమని టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం పాఠశాలలో సావిత్రి బాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే వేసిన విద్య పునాదులే నేటి స్వేచ్ఛకి ప్రధాన కారణమని తెలిపారు. కులమతాల పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మసైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన సీ్త్రలు చదువుకునేందుకు పాఠశాలలు ప్రారంభించారన్నారు. భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాల నిర్మూలనకు శ్రమించారని పేర్కొనానరు. అనంతరం కేజీఎస్ పాఠశాల విద్యార్థుల వేషాధారణ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నిర్మలా రవి, మంజుళ పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: నవోదయ ఆస్పత్రి వద్ద శనివారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంఆ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్ మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే సర్కిల్ నిర్మాణం చేపట్టి నామకరణం చేయడం జరిగిందన్నారు. నవోదయ కళాశాల వద్ద సర్కిల్‌కు పేరు పెట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉగ్ర నరసింహప్ప, అధ్యక్షుడు ఈరణ్ణ, బసవరాజ్, శశిధర్, రవి కుమార్, మహదేవ్, లక్ష్మి, యశోద, శారద, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయచూరు తాలుకా ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి ఆచరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దండెప్ప బిరదార్ మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే విద్యా రంగానికి విశేష సేవలందించారని తెలిపారు. సావిత్రి బాయి పూలే సరస్వతి పుత్రికగా పేరుపొందారన్నారు. కార్యక్రమంలో వీణ, శివలీల, పద్మావతి, సావిత్రి, నాగారాజ్, దివ్య తదితరులు పాల్గొన్నారు.
సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి
సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి


