గూండా ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి
సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి గూండాగిరి చేసి, రాళ్లు రువ్వి తమ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆయన నగరంలోని గాలి జనార్దనరెడ్డి ఇంటి ముందు బ్యానర్లు వేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున గొడవ, కాల్పులు జరిగి ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడిన నేపథ్యంలో వారిని శుక్రవారం అరుణోదయ ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సతీష్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ప్రైవేటు గన్‌మెన్లను ఉపయోగించుకుని కాల్పులు జరిపించారన్నారు. నగరంలో అనుమతి లేకుండా బ్యానర్లు వేసుకుని, గుండాగిరి చేశారన్నారు. గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి వంటి పార్టీ నాయకులకు బెదిరించాలని నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి చూస్తున్నారన్నారు. దీనిని తాము సహించేది లేదన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై గూండాగిరి చేశారన్నారు. 25 ఏళ్ల క్రితమే బళ్లారిలో తమ పార్టీకి చెందిన శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అధికారం ఉందని నిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రులు శ్రీరాములు, ఆనంద్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, టీ.హెచ్.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
అఽధికార పార్టీ ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాలి
ఎమ్మెల్యే నేతృత్వంలోనే గుండాగిరి జరిగింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ఆరోపణ


