చోరీ కేసులో నిందితుల అరెస్ట్
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి 12 గంటల్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన ఘటన శుక్రవారం జరిగింది. హరపనహళ్లి పట్టణంలోని బనగేరిలో నివాసముంటున్న ఉపాధ్యాయిని షహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. గురువారం ఉదయం డ్యూటీపై పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయిని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో ఉంచిన సుమారు రూ.18.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని కనుగొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే హరపనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల ఆచూకీ కోసం హరపనహళ్లి సీఐ మహంతేష్ సజ్జన్, ఎస్‌ఐ శంభులింగ హిరేమట్, రవి, సిబ్బంది ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, రూ.3 లక్షల నగదు, రూ.1 లక్ష విలువైన ఆటోతో సహా మొత్తం రూ.22.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
రూ.22.60 లక్షల విలువైన ఆభరణాలు, నగదు, ఆటో స్వాధీనం


