శ్రీగంధం తోటలను కాపాడుకోవాలి
శ్రీనివాసపురం: సమాజంలో జనాభా పెరుగుతున్న కొద్ది నేరాలు కూడా అధికం అవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి గాను ప్రజల సహకారంతో కూడిన ఒక రక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని సిఐ ఎంబి గొరవనహళ్లి తెలిపారు. గురువారం యల్దూరు గ్రామంలో శ్రీగంధం ఉత్పాదన, రక్షణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శ్రీగంధం చెట్లు ఎంతో విలువైనవి కావడం వల్ల వాటిని దొంగిలించే ప్రయత్నాలు జరుగుతాయి. వాటి రక్షణ కోసం రైతులు శ్రీగంధం తోటల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలను అలవర్చుకోవాలన్నారు. జి వెంకటప్ప, బెల్లం శ్రీనివాసరెడ్డి, యల్దూరు మణి తదితరులు పాల్గొన్నారు.


