విలేకరుల సంఘం ఎన్నికలు
చెళ్లకెర రూరల్: చిత్రదుర్గ కర్ణాటక కార్యనిరత విలేకరుల సంఘం ఎన్నికలు ఆదివారం శాంతియుతంగా జరిగాయి. అధ్యక్షుడిగా వినాయక తొడరనాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్య సమితి సభ్యత్వ స్థానానికి దీనేష్ గౌడగెరె, రాజశేఖర్, సిద్ధరాజు మధ్య తీవ్ర పోటీ జరిగింది. డైరెక్టర్లు ఎస్.అమిత్, టీఎస్.కుమార్, హెస్‌సీ.గిరీష్, చౌలూరు మంజునాథ్, జడేకుంటే మంజు నాథ్, టీజే.తిప్పేస్వామి, టి.దర్శన్, ఎస్టీ నవీణ్‌కుమార్, హెచ్‌టీ.ప్రసన్న, జీఓఎన్.మూర్తి, ఎస్‌బీ.రవి కుమార్, రవి మల్లాపుర, ఎస్.రాజశేఖర్, విశ్వనాథ్, కేజీ వీరేంద్ర కుమార్, గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్ష స్థానాలకు, రాజ్య సభ సభ్యత్వ స్థానానికి ఇది వరకూ ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఎన్నికల అధికారిగా చిక్కప్పనహళ్లి షణ్ముకప్ప బాధ్యతలను చేపట్టారు.


