సర్వం నమఃశ్శివాయ | - | Sakshi
Sakshi News home page

సర్వం నమఃశ్శివాయ

Nov 11 2025 5:51 AM | Updated on Nov 11 2025 5:51 AM

సర్వం

సర్వం నమఃశ్శివాయ

బనశంకరి: పవిత్ర కార్తీక మాసంలో పరమ శివుని దర్శనం ద్వారా భక్తులు పునీతులయ్యారు. పరమేశ్వరుడు, అమ్మవార్ల ఆలయాల్లో విశేష పూజలు, వేడుకలతో కోలాహలం నెలకొంది. బనశంకరీదేవి ఆలయంలో కార్తీక శోభ మిన్నంటింది. ఆలయంలోని పర్వత మల్లికార్జునస్వామికి అర్చకులు ఏ.చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి సన్నిదిలో కార్తీక దీపారాధన చేశారు. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పూజలు చేసి దీపాలు వెలిగించారు.

ఓంకార ఆశ్రమంలో

నగరంలో ఉత్తరహళ్లి–కెంగేరి రహదారిలోని శ్రీనివాసపురలో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగాలకు రుద్రాక్షలతో అలంకరించారు. పీఠాధిపతి మధుసూదనానందపురి స్వామి పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు.

శ్రీ గురుమూర్తేశ్వర స్వామికి

చింతామణి: కార్తీక మాస మూడవ సోమవారం కావడంతో తాలూకాలోని ప్రసిద్ధ ఆలంబగిరిలోని శ్రీ గురుమూర్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిపి పూజలు గావించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తాదులు దర్శనం చేసుకున్నారు.

భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవార పూజలు

సర్వం నమఃశ్శివాయ1
1/2

సర్వం నమఃశ్శివాయ

సర్వం నమఃశ్శివాయ2
2/2

సర్వం నమఃశ్శివాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement