బెంగళూరులో భారీగా డ్రగ్స్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో భారీగా డ్రగ్స్‌ సీజ్‌

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

బనశంకరి: రాజధానిలో నలుమూలలా మత్తు పదార్థాల విక్రేతల హవా అధికమైంది. తినుబండారాలు అమ్మినంత సులభంగా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో యలహంక ఉపనగర, ఆడుగోడి, భారతినగర, జాలహళ్లి, పులకేశినగర పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రగ్స్‌ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులతో పాటు 11 మందిని నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విలువ రూ.5 కోట్ల పైనే

వీరి వద్ద నుంచి రూ. 5.14 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. డ్రగ్స్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయా ప్రాంతాలలో డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడులు జరిపి విక్రేతలను పట్టుకున్నట్లు తెలిపారు. 2 కిలోల ఎండీఎంఏ, 31 కిలోల గంజాయి, 220 గ్రాముల హైడ్రో గంజాయి, 162 గ్రాముల హెరాయిన్‌ ఇందులో ఉన్నాయి. యలహంకలో నైజీరియన్‌ డ్రగ్స్‌ విక్రేత సామ్యుయేల్‌ను అరెస్టు చేసి 2 కేజీల ఎండీఎంఏని సీజ్‌ చేశారు.

11 మంది విక్రేతల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement