రాష్ట్రపతి రాకకు తుమకూరు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి రాకకు తుమకూరు సిద్ధం

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

తుమకూరు: కాయక యోగి, గొప్ప మానవతావాదిగా ప్రసిద్ధ చెందిన డాక్టర్‌ శివకుమార స్వామి 119వ జయంతి, గురువందన మహోత్సవం తుమకూరులోని సిద్ధగంగ మఠంలో బుధవారం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. జిల్లా యంత్రాంగం ఆమెకు లాంఛనాలతో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తుమకూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సిద్ధగంగ మఠానికి చేరుకుని జయంతి వేడుకలలో పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ముర్ము బెంగళూరుకు చేరుకోగా గవర్నర్‌ గెహ్లాట్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు.

వేలమంది కూర్చునేలా విశాలమైన వేదిక నిర్మాణమైంది. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ స్వామీజీలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు రాబోతున్నారు. వారికి అన్న దాసోహ కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాయక యోగి శివకుమారస్వామి జయంతి ఉత్సవం నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement