ర్యాపిడో బుక్ చేస్తే ఇదేనా..? యువతికి చేదు అనుభవం | Rapido Rider Incident Woman Unsafe Experience | Sakshi
Sakshi News home page

ర్యాపిడో బుక్ చేస్తే ఇదేనా..? యువతికి చేదు అనుభవం

Apr 1 2026 11:17 AM | Updated on Apr 1 2026 12:16 PM

Rapido Rider  Incident Woman Unsafe Experience

బెంగళూరు: యువతి పట్ల ర్యాపిడో  బైక్‌ డ్రైవర్‌ అసభ్యకరంగా వ్యవహరించగా అ తన్ని బెంగళూరు ఇందిరానగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒక యువతి బీటీఎం లేఔట్‌ నుంచి ఇందిరానగర్‌ వెళ్లడానికి ర్యాపిడో బుక్‌ చేసుకుంది. బైక్‌ డ్రైవర్‌ మహమ్మద్‌ ఖాజా ప్రయాణం సమయమంతా యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించి  లైంగికంగా వేధించాడు. దీంతో యువతి ఇందిరానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. 

‘కుక్కకాటుకు కోమాలోకి..
బెంగళూరు: వీధి కుక్కల దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి జారుకున్న సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా హొల్లోళిహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. బసవరాజు (18) అనే వ్యక్తిపై  ఇటీవల  వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని బిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా కోమాలోకి వెళ్లిపోయాడు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement