ఉచిత వైద్య సేవలకు రూ.850 కోట్లు
రాయచూరురూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు కళ్యాణ కర్నాటక అభివృద్ధి మండలి నుంచి రూ.850 కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. సిరవార తాలుకా సముదాయ అరోగ్య కేంద్రం వసతి గదుల నిర్మాణాలకు ఆది వారం ఆయన భూమి పూజ చేశారు. మంత్రి బోసురాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పంచ గ్యారెంటీల పథకం అమలుపై ప్రస్తావించారు. అస్పత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా వైద్య సేవలందించేందుకు అధికారులు ముందుంటారన్నారు. కార్యక్రమంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్యనాయక్, జిల్లా అరోగ్య అధికారి సురేంద్రబాబు, అశోక్‌పవార్ పాల్గొన్నారు.
విద్యార్థుల శ్రమదానం
రాయచూరు రూరల్: స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా లింగసూగురు తాలుకా జలదుర్గంలో రాయచూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఆదివారం శ్రమదానం నిర్వహించారు. పరిసరాల సంరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం అంశాలపై అవగాహన కల్పించి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవనం, ఉద్యాన వనం, దేవాలయాల చుట్టూ చెత్తా చెదారం తొలగించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ సంతోష్‌కుమార్, అన్నపూర్ణ, జమున, నరసమ్మ, నాగమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
దత్తాత్రేయుడికి పల్లకీ సేవ
రాయచూరురూరల్: రాయచూరు తాలుకా గుంజహళ్లి దతాత్రేయస్వామి అలయంలో స్వామికి పల్లకీసేవ ఆదివారంౖ వెభవంగా నిర్వహించారు. నల్లన్న స్వామి 17వ అరాధన సందర్భంగా మఠాధిపతి భాస్కర్‌స్వామి అధ్వర్యంలో అనంతరం దేవాలయం నుంచి కృష్ణానది వరకూ పల్లకీ సేవ జరిపారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
కసాప సేవల విస్తరణ
రాయచూరురూరల్: జిల్లాలో కన్నడ సాహిత్య పరిషత్ సేవలను విస్తరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగణ్ణపాటిల్ పేర్కొన్నారు. స్థానిక కన్నడ భవనంలో నూతన తాలుకా కన్నడ సాహిత్య పరిషత్ పదాధికారుల సభలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ పదాధికారుల సేవలు విస్త్రతం చేయాలని, కసాప కార్యక్రమాలను చేపట్టడానికి అందరు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విజయేంద్ర రాజేంద్ర, శరణబసవ, మహదేవప్ప, మౌనేష్, శివరాజ్, విద్యావతి పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రగౌడ
బళ్లారిటౌన్: కర్ణాటక వర్నింగ్ జర్నలిస్ట్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎన్.వీరభద్రగౌడ ఎన్నికయ్యారు. ఆదివారం జర్నలిస్టు యూనియన్ ఎన్నికలు జరపగా ప్రత్యర్థి రవికుమార్‌పై 23 ఓట్ల తేడాతో వీరభద్రగౌడ గెలుపొందారు. అదే విధంగా మూడు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్.గురుశాంత, వాగిష, మల్లయ్య ఎన్నికయ్యారు. ఇక కార్యవర్గ సభ్యులుగా హెచ్.ఎం.బసవరాజు, ప్రధాన కార్యదర్శిగా నరసింహమూర్తి, కోశాధికారిగా అశోక్లు ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యుల ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దుపోయేంత వరకూ జరిగింది.
ఉచిత వైద్య సేవలకు రూ.850 కోట్లు
ఉచిత వైద్య సేవలకు రూ.850 కోట్లు
ఉచిత వైద్య సేవలకు రూ.850 కోట్లు
ఉచిత వైద్య సేవలకు రూ.850 కోట్లు


