బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఇప్పుడు భయానకంగా మారింది. హెచ్చెల్సీలో గత రెండు రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలు బయటపడడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. బొమ్మనహాళ్ హెచ్చెల్సీ సెక్షన్ పరిధిలోని డి.హీరేహాళ్ మండలం నాగలాపురం సమీపంలోని 117, 116 కిలోమీటర్ల వద్ద శనివారం రెండు మృతదేహాలు బయట పడగా.. ఆదివారం మరో మృతదేహం తేలింది. కాళ్లకు తాళ్లు కట్టేసి ఉండడంతో మిస్టరీగా మారింది. ప్రమాదమా? హత్యనా? ఆత్మహత్యానా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో వరుసగా మూడు మృతదేహాలు లభ్యం కావడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కనిపించిన రెండు మృతదేహాల్లో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న ఓ శవాన్ని ముందుకు తోసేయడంతో అది ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తును తప్పించుకునేందుకు హెచ్చెల్సీ ఉపరిభాగంలో ఉన్న పోలీసులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని, అయితే దిగువన ఉన్న డి.హీరేహాళ్ పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజుకొక శవం కాలువలో కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాలు కర్ణాటక ప్రాంతం నుంచి కొట్టుకువచ్చాయా? లేదా జిల్లా వాసులవా? అనేది తేలాల్సి ఉంది.
ప్రసన్న వేంకటరమణ స్వామికి పూజలు
మాలూరు: కార్తీక మాసం సందర్భంగా తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలోని ప్రసిద్ధ యాత్రాస్థలమైన చిక్కతిరుపతిలో ప్రసన్న వేంకట రమణస్వామి ఆలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు గోపాల కృష్ణ భరద్వాజ్ నేతృత్వంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. స్థానికులతోపాటు తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గ్రామ పంచాయతీ కట్టడం ప్రారంభం
శ్రీనివాసపురం: తాలూకాలోని ముదువాడి గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన మొదటి అంతస్తును ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉందని, అయినా తాలూకాలో అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు అందించాల్సిన నిధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇంచర గోవిందరాజు, సమాజ సేవకుడు శ్రీనాథ్, తాపం ఈఓ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్ర కాలువలో మరో మృతదేహం
తుంగభద్ర కాలువలో మరో మృతదేహం
తుంగభద్ర కాలువలో మరో మృతదేహం


