నేడే మాలూరు రీకౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే మాలూరు రీకౌంటింగ్‌

Nov 11 2025 5:51 AM | Updated on Nov 11 2025 5:51 AM

నేడే

నేడే మాలూరు రీకౌంటింగ్‌

కోలారు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్‌ను మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహిస్తారు. ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అభ్యర్థులతో పాటుగా పార్టీల కార్యకర్తలు, ప్రజలలో తీవ్ర కుతూహలం నెలకొంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నంజేగౌడ ఎన్నిక అక్రమమని బీజేపీ అభ్యర్థి మంజునాథగౌడ ఫిర్యాదు చేయడంతో రీకౌంటింగ్‌ కు రంగం సిద్ధమైంది.

హార్టికల్చర్‌ వర్సిటీలో లెక్కింపు

కోలారు నగర సమీపంలోని హార్టికల్చర్‌ విశ్వ విద్యాలయంలో రీకౌంటింగ్‌ జరుగుతుంది. సోమవారం గట్టి పోలీసు బందోబస్తు మధ్యన అభ్యర్థుల సమక్షంలో తెరిచి కంటైనర్‌ ద్వారా కౌంటింగ్‌ కేంద్రం వద్దకు తరలించారు. 14 టేబుళ్లలో 18 రౌండ్‌లలో లెక్కింపు సాగుతుంది. కేంద్రం చుట్టూ 144 సెక్షన్‌ జారీ చేశారు. కౌంటింగ్‌ తరువాత వెంటనే ఫలితాలు వెలువడవు, ఆ ఫలితాలను గుట్టుగా సీల్డ్‌ కవర్లో ఉంచి సుప్రీంకోర్టుకు అధికారులు సమర్పిస్తారు. ఎన్నికల నియమాల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం ఆర్‌ రవి తెలిపారు.

ఎమ్మెల్యే నంజేగౌడ, బీజేపీ అభ్యర్థి మంజునాథ

సీల్డ్‌ కవర్‌లో ఫలితాలు సుప్రీంకోర్టుకు

నేడే మాలూరు రీకౌంటింగ్‌ 1
1/2

నేడే మాలూరు రీకౌంటింగ్‌

నేడే మాలూరు రీకౌంటింగ్‌ 2
2/2

నేడే మాలూరు రీకౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement