కరగ పూజారులు
ద్రౌపదీదేవి, అమ్మవార్లు
బనశంకరి: బెంగళూరు ద్రౌపదీ దేవీ పూల కరగ శక్త్యోత్సవంలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ద్రౌపదీ దేవీ పూల కరగ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. చైత్ర పౌర్ణమి రోజున ఈ వేడుకను జరపడం ఆనవాయితీ. కరగ పూజారి జ్ఞానేంద్ర ధర్మరాయ స్వామి ఆలయం ముందు కర్పూర సేవ చేపట్టారు. అర్ధరాత్రి పూల కరగను నగర వీధుల్లో పర్యటించారు. సరిగ్గా సూర్యోదయం సమయానికి మళ్లీ ఆలయానికి చేరుకున్నారు. మంత్రి రామలింగారెడ్డి, పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తదితరులు ఆలయాన్ని దర్శించుకున్నారు.


