మండ్య: రోడ్డు మీద వెళ్తున్న కింగ్ కోబ్రా పాము ఇంట్లోకి దూరింది. జిల్లాలోని కాచిబట్టి గ్రామంలో రోడ్డు దాటుతున్న సుమారు 14 అడుగుల గిరినాగు ఒకటి వాహనం తగలడంతో పక్కనే రాజు నాయక్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. వంటింట్లో తిష్టవేసిన అతిథిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. అటవీ సిబ్బందికి కాల్ చేయగా, వారు మహేశ్ నాయక్‌కు చెప్పారు. మహేశ్ నాయక్, ఆయన కుమారుడు గగన్ నాయక్ చాలాసేపు కష్టపడి కింగ్ కోబ్రాను క్షేమంగా పట్టుకున్నారు. దానిని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు.


