కర్ణాటక: సామాన్యంగా టీవీ పాడైపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళతారు. అయితే చామరాజనగర మల్లయ్యనపుర గ్రామంలో దొడ్డమాదప్ప ఇంటిలో జరిగింది వేరే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో టీవీ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ శబ్ధాలు ఎక్కువ కావడంతో టీవీ లోపల చూసి నిశ్చేష్టులయ్యారు.
లోపల ఏదో కదులుతూ కనిపించింది. ఆ తర్వాత అది పాము అని తెలిసి వెంటే స్నేక్ చాపు నకు కాల్ చేశారు. స్నేక్ చాపు టీవీని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి అందులో మకాం వేసిన 8 అడుగుల విషపూరిత పామును పట్టుకున్నాడు. టీవీ వైర్ల మధ్య చుట్టుకుని ఉందది. ఇంటి చుట్టుపక్కల ఎలుకలు, కప్పలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం వచ్చి టీవీలో చేరినట్లు స్నేక్ చాపు తెలిపాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.


