అవినీతి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
కేజీఎఫ్: అవినీతి రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత కావాలని మానవ వనరుల శాఖ డైరెక్టర్ దేబి ప్రసాదర్ సత్పతి అన్నారు. బెమెల్ కాంప్లెక్స్‌లోని కళా క్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విజిలెన్స్ జాగృతి సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలనలో నైతికత, పారదర్శకత కలిగి ఉండాలన్నారు. బెమెల్ కేజీఎఫ్ విభాగం ప్రముఖుడు యోగానంద మాట్లాడుతూ అవినీతిపై పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేయాల్సి ఉందన్నారు. మానవ వనరుల ప్రముఖులు నీనాసింగ్, యోజనా ప్రముఖుడు మల్లికార్జున రెడ్డి, విజిలెన్స్ విభాగం ప్రముఖుడు వినయ్ పాల్గొన్నారు.


