కన్నడ భాషకు సేవలు అపారం
రాయచూరురూరల్: రాష్ట్రంలో కన్నడ భాషకు తోడుగా.. గడినాడు కన్నడలో చేస్తున్న సేవలు అపారమని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు రామణహవళే అభిప్రాయపడ్డారు. హోసముని ప్రకాశన స్థానిక కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన న్రపతుంగ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామణహవళే మాట్లాడుతూ గడినాడులో కన్నడ భాష సంరక్షణకు బషీరుద్దీన్ చేస్తున్న సేవలకు అందరూ సహకరించాలన్నారు. ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులు కన్నడకు లభించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన చామరస మాలి పాటిల్, బాషా, అయ్యప్పహుడా, సయ్యద్‌గౌస్ మెయినుద్దీన్, పీర్‌జాద్ ఈరణ్ణ, రామలింగప్ప, బీరప్ప శంభోజీ, వీరేంద్ర, విక్రమరాజ, పద్మ, సోనమ్మలను న్రపతుంగ అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపీ, షంషాద్‌బేగం, పర్వీనాబేగం, శీపా, ఋషి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
హొసపేటె: హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల నుంచి 14–17 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. మొత్తం 892 మంది వరకు పోటీదారులు పేర్లు నమోదు చేసుకోగా, 692 మంది పోటీలలో పాల్గొన్నారు. అదే విధంగా 30 మంది న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి.
కార్తీక వనభోజనం
హొసపేటె: హొసపెటెలో నివసిస్తున్న తెలుగు సభ్యులు సంప్రదాయ పద్ధతిలో కార్తీక వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. బళ్లారి రహదారిలోని వడ్రళ్లి తోటలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక తెలుగు సంఘం అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ధర్మారావు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకమాసం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన నెల అన్నారు. ఈ సందర్భంగా ఆనంద్, రమణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను
నిషేధించాలనడంపై ఆగ్రహం
హుబ్లీ: ఆర్‌ఎస్‌ఎస్ సంస్థను నిషేధించాలనడం మూర్ఖత్వమేనని శ్రీరామ సేనా చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం ప్రియాంకఖర్గే, ఆయన తండ్రి వల్ల కూడా సాధ్యం కాదన్నారు. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుని, బలమైన పునాది కలిగిన సంస్థను నిషేధించాలని ప్రయత్నించినా.. అడ్డంకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిందన్నారు. దేశాన్ని విడగొట్టి నాశనం చేసిన కాంగ్రెస్‌కు 130 ఏళ్ల చరిత్ర ఉన్నా.. ముక్కలు చెక్కలై పాడైందన్నారు.
అందరినీ ఒప్పించి చెరకు
ధర నిర్ణయించాం
హుబ్లి: చెరకు కర్మాగారాల యజమానులను ఒప్పించి కేంద్రం మద్ధతు ధరకంటే అదనంగా రూ.700 ఇప్పించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎంబీ.పాటిల్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాగళకోటె, విజయపుర నగరంలో చెరకు ధర విషయలో గందర గోళం నెలకొందన్నారు. కేంద్ర సర్కారు రూ.3550 ధర నిర్ణయించిందని తెలిపారు. చెరకు కోత రవాణా వ్యయం రూ.900 అవుతుంటే.. కేంద్రం రూ.2600, రూ.2700 మద్ధతు ధర ఇచ్చిందన్నారు. ప్రస్తుతం సీఎం సూచనతో ఎంఆర్పీ ధర కన్నా రూ.700 పెరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర చెరకు రైతుల సమస్యలను ఆసరాగా తీసుకుని డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బిడ్డగా చెప్పుకొనే విజయేంద్రకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని సమస్య విన్నవించాలని ఆయన సూచించారు.
కన్నడ భాషకు సేవలు అపారం
కన్నడ భాషకు సేవలు అపారం
కన్నడ భాషకు సేవలు అపారం
కన్నడ భాషకు సేవలు అపారం


