బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్‌ | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్‌

Oct 26 2024 1:50 AM | Updated on Oct 26 2024 10:57 AM

బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్‌

బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్‌

ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లై ఓవర్‌పై భారీ రద్దీ

బొమ్మనహళ్లి: బెంగళూరులో గత వారం పది రోజులుగా కురిసిన కుండపోత వానలకు అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ట్రాఫిక్‌ సమస్య ఆకాశాన్నంటింది. ఎక్కడ చూసినా జామ్‌లు ఏర్పడ్డాయి. సెంట్రల్‌ సిల్క్‌బోర్డు నుంచి బొమ్మనహళ్లి మీదుగా ఉన్న ఎలక్ట్రానిక్‌ సిటీ వరకు ఈ నెల 23వ తేదీన వర్షంలో ఎన్నడూ లేనంత ట్రాఫిక్‌ జాం అయ్యింది. బొమ్మనహళ్లి నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీ వరకు ఉన్న వంతెన పైన సుమారు 2 గంటలకు పైన వాహనాలు చిక్కుకుపోయాయి. వంతెన కింద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్ళకు బయల్దేరిన ఐటీ, బీటీ సిబ్బంది రోడ్లపై ఇరుక్కుపోయారు.

నడుస్తూ వెళ్లిపోయారు
చాలా మంది క్యాబ్‌లు వదిలేసి నడుస్తూ వెళ్లిపోయినట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. కారులో ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉన్న ఆఫీసు నుంచి వంతెన పైకి చేరుకోవడానికి గంట సమయం పట్టింది. మరో దారిలేక క్యాబ్‌ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయానని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 గంటల పాటు వాహనాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనంత రద్దీ ఏర్పడింది. ఇదీ బెంగళూరు నగర ట్రాఫిక్‌ సమస్య అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement