
ఎన్నికల ప్రచార సభలో రప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
శివాజీనగర: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం చిక్కమగళూరు జిల్లా శృంగేరి శ్రీశారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గురుభవన్‌కు వెళ్లి విధుశేఖర్ భారతీ స్వామిని కలిశారు. స్వామీజీ ఆమెను ఆశీర్వదించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం ప్రియాంకగాంధీ బాళెహొన్నూరు శ్రీరంభాపురి మఠాన్ని సందర్శించి గజరాజు ఆశీర్వాదం పొందారు.
శృంగేరితోపాటు హరియూరులో జరిగిన సభల్లో మాట్లాడారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వ అవినీతి పాలనతో విసుగెత్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజలు మరచిపోలేదని, ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.