న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు దీపాలు వెలిగించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 28 రోజులుగా శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతతోపాటు సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేరేవరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా నాయకులు తేల్చి చెప్పారు. – కరీంనగర్


