అంబేడ్కర్ మైదానం పక్కన ఆదాయపు పన్ను కార్యాలయం పక్కనున్న 20 గుంటల స్థలం కబ్జాకు గురవుతోంది. సర్వే నం.1104లో 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం దివ్యాంగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్(టీసీపీసీ) భవన నిర్మాణం కోసం 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వాలు మారాయే గానీ భవన నిర్మాణం కాలేదు. స్థలంపై పర్యవేక్షణ లేక 60 గజాల స్థలం కబ్జాకు గురైంది.
– మొగిలి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,
తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం


