కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యలను మానవీ య కోణంలో పరిశీలించి పరిష్కారం చూపడ మే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్జీ లు రాగా.. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యధిక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న జిల్లా పంచాయతీ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ ఆర్టీసీ, ఇరిగేషన్ తదితర శాఖలను మందలించారు. 2026 మే నుంచి అక్టోబర్ వరకు జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 5,943 అర్జీలు స్వీకరించగా.. 4,880 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ, డీఆర్వో స్వామి అర్జీలను స్వీకరించగా.. మొత్తం 92 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి–జనరల్ ఐసీయూలో ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తున్నం. 14 మందిమి వివిధ రకాల సేవలందిస్తున్నాం. 3 నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణ కష్టంగా ఉంది. అధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
– ప్రభుత్వ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు


