ప్రతీవారం టూర్‌ డైరీ సమర్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీవారం టూర్‌ డైరీ సమర్పించాలి

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

● 19న ప్రారంభోత్సవాలకు సిద్ధం కండి ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశం ● వరుసగా మూడోసారి నియామకం ● చేతనైతే కేసులు పెట్టి దర్యాప్తు చేయించండి ● బండి సంజయ్‌, పొన్నం ప్రభాకర్‌కు మాజీ మేయర్‌ సవాల్‌

● 19న ప్రారంభోత్సవాలకు సిద్ధం కండి ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశం

కరీంనగర్‌ అర్బన్‌: అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రతీవారం తమ టూర్‌ డైరీని జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. రాబోయే వారంలో నిర్వహించాల్సిన పనులపై అడ్వాన్స్‌ టూర్‌ ప్రోగ్రాం డైరీ సిద్ధం చేసుకోవాలని, వారం తర్వాత టూర్‌ డైరీని సమర్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి అనంతరం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయి సందర్శనలో అధికారులు ప్రజా అవసరాలు, సమస్యలు గుర్తించి చర్చించాలని తెలిపారు. ఈనెల 19న నిర్మాణం పూర్తయిన వీవో, గ్రామపంచాయతీ, అంగన్వాడీ, పాఠశాల తరగతి గదులు ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు తమ మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా సత్యప్రసన్న

కరీంనగర్‌ కార్పొరేషన్‌: మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుత అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న మరోసారి నియమితులయ్యారు. సోమవారం మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన సత్యప్రసన్న గత రెండు పర్యాయాలుగా మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. వరుసగా మూడోసారి కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన సత్యప్రసన్నకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరోపణలు చేస్తే సరిపోదు

కరీంనగర్‌టౌన్‌: డంప్‌యార్డ్‌ సమస్యను పరిష్కరించడంలో విఫలమై, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ మేయర్‌, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు. సోమవారం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టర్లను ఎవరు బెదిరిస్తున్నారు, పనులను ఎవరు అడ్డుకుంటున్నారు, ఆధారాలుంటే కేసులు పెట్టి సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు. అభివృద్ధిని అడ్డుకోవాల్సిన దుస్థితి బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలతో కలిసి బీజేపీ, కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని నడిబజారులో ఎండగడతామని, ప్రజాగ్రహం ముందు ఆ పార్టీలు నిలవలేవని హెచ్చరించారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనుల కారణంగా మంగళవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ ఇండస్ట్రీయల్‌ ఫీడర్‌ పరిధిలోని మానేర్‌నగర్‌, పద్మనగర్‌, ప్రగతినగర్‌, మార్కెండేయనగర్‌, లారెల్‌ స్కూల్‌ ప్రాంతాలతోపాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ ఐబీ ఫీడర్‌ పరిధిలోని కోర్టు చౌరస్తా, వన్‌ హాస్పిటల్‌, పాత డీఐజీ బంగ్లా, ఐబీ చౌరస్తా, సర్కస్‌ మైదానం, పద్మనాయక కల్యాణ మంటపం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

కొత్తపల్లిలో..

విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33 కేవీ కొత్తపల్లి ఫీడర్‌ పరిధిలోని రాణిపూర్‌, కిమ్స్‌ కళాశాల, ఢిల్లీ ఢిఫెన్స్‌ అకాడమీ, జూనియర్‌ కళాశాల, రిలయన్స్‌ మాల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement