రైతులకు అండగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా ఉండాలి

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● బ్యాంకర్లకు కలెక్టర్‌ ఆదేశం ● శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌

● బ్యాంకర్లకు కలెక్టర్‌ ఆదేశం

కరీంనగర్‌ అర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున అర్హులైన రైతులకు బ్యాంకర్లు అండగా నిలవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు. కరువు వేళ సిబ్బంది మానవతా దక్పథంతో వ్యవహరించి పంట రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో ఆర్డీవోలు షర్మిల, జలకుమారితో కలిసి ఎల్‌డీఎం ఉమాశంకర్‌, ఆర్బీఐ ఏజీఎం చిరంజీవి, నాబార్డ్‌ డీడీఎం జయప్రకాశ్‌, ఇతర బ్యాంక్‌ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ రూరల్‌, హుజూరాబాద్‌ మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందన్నారు. పాక్షిక కరువు మండలాల్లో 36 నెలల వరకు రుణాలను మధ్యకాలిక రుణాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడొద్దని స్పష్టం చేశారు.

ఉపయోగపడేలా పని చేయాలి

కరీంనగర్‌సిటీ: సమాజానికి ఉపయోగపడేలా సామాజిక మధ్యమాలు పని చేయాలని, వాటిలో అన్ని రంగాల్లో తెలుగును వినియోగించాల ని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌ తెలిపారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ, శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాలు, వివిధ ప్రక్రియలు, రచన విధానాలు అనే 2 రోజుల వర్క్‌షాప్‌ ముగింపు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమేశ్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. సాహిత్య ప్రక్రియల విస్తృతితోనే సామాజిక చైతన్యం సాధ్యమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కల్వ కుంట రామకృష్ణ, టీజీసీ జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కడారు సురేందర్‌రెడ్డి, తెలుగు విభా గాధిపతి బూర్ల చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.రాజయ్య, స్టాఫ్‌ క్లబ్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నా రు.

సీఐడీ విచారణ ముమ్మరం

జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీఎమ్మార్‌ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేయడం కలకలం రేపుతుంది. విజిలెన్స్‌ అధికారులు తనిఖీల ఆధారంగా 10 రోజుల క్రితం సీఐడీ రంగంలోకి దిగి జమ్మికుంటకు చెందిన ఒల్లాల మల్లికార్జున్‌, యాంసాని సంపత్‌, లెంకలపల్లి మధుసూదన్‌, హుజూరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు విషయం తెలిసిందే. ఆ మిల్లుల్లోని భాగస్వాములపై కేసు నమోదైంది. పరారీలో ఉండగా.. అదపులోకి తీసుకునేందుకు సీఐడీ వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆ మిల్లర్లను కోర్డు ద్వారా సీఐడీ కస్టడీకి తీసుకొని బుధవారం జమ్మికుంట 3 మిల్లుల్లో నిందితుల సమక్షంలో ముమ్మరంగా విచారణ చేపట్టింది. 3 మిల్లుల్లోని రికార్డుల తనిఖీ నిర్వహించారు. విచారణలో గోప్యత పాటించారు. లోతైన విచారణతో పూర్తిస్థాయిలో కీలక అధారాలు సేకరించినట్లు విశ్వనీయ సమాచారం.

స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో పత్తి ధర క్రమంగా స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం 8,800 ఉన్న పత్తి ధర బుధవారం రూ.8,710 పలికింది. మోడల్‌ ధర రూ.8,550, కనిష్ట ధర రూ.8,300కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement