బల్దియాలో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల ఆందోళన

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● గంటన్నరపాటు ఈఈ దిగ్బంధం ● నిధుల కేటాయింపులో వివక్ష చూపారంటూ నిరసన ● మేయర్‌, కమిషనర్‌ హామీతో విరమణ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆందోళనకు దిగారు. అభివృద్ధి పనులకు సంబంధించి తమ ప్రతిపాదనలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ నిరసన చేపట్టారు. సమాధానం చెప్పేవరకు కదిలేది లేదంటూ ఈఈ లచ్చిరెడ్డిని ఆయన చాంబర్‌లోనే గంటన్నరపాటు దిగ్బంధించారు. చివరకు మేయర్‌, కమిషనర్‌ హామీతో ఆందోళన విరమించారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో తమ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోలేదంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు వైద్యుల అంజన్‌కుమార్‌, వరాల నర్సింగం, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్‌, పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్‌ సిద్ధ్దం కాగా.. అందులో తమ ప్రతిపాదనలు లేకపోవడంపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఈఈ లచ్చిరెడ్డిని నిలదీశారు. తమపార్టీ కార్పొరేటర్ల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము నగర అభివృద్ధికి సహకరిస్తుంటే తమ డివిజన్లలోనే అభివృద్ధి పనులు పెట్టకపోవడమేమిటని మండిపడ్డారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, ఈఈని కూడా కదలనియ్యమంటూ నిరసన తెలిపారు. చివరకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు పనులు పెడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement