లక్ష్మీపూర్‌ శివారులో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీపూర్‌ శివారులో భారీ అగ్నిప్రమాదం

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన ప్లాస్టిక్‌ గోదాం ● రూ. 50లక్షల వరకు ఆస్తి నష్టం?

● షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన ప్లాస్టిక్‌ గోదాం ● రూ. 50లక్షల వరకు ఆస్తి నష్టం?

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్‌ శివారులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్‌ గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన స్క్రాప్‌ వ్యాపారి కోల నవీన్‌ లక్ష్మీపూర్‌ శివారులో ప్లాస్టిక్‌, స్క్రాప్‌ గోదాం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి గోదాంలో అకస్మాత్తుగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. లోపల ఉన్నదంతా ప్లాస్టిక్‌ సామగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించి గోదాం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొదట రూ.15 లక్షల విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు భావించినప్పటికీ మంటల తీవ్రతకు సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని యజమాని, స్థానికులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement