సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● ఉత్సాహంగా ముగిసిన లెవల్‌–1 పరీక్ష ● పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థులు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఆంగ్ల అక్షరాలన్నీ ఒకటే.. పదాలు వేరు.. అంకెలు కూడా ఒకటే.. ఫార్ములాలు అనేకం. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌లో తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ కన్వీనర్‌గా స్పెల్‌బీ తరహా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంగ్లిష్‌తో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు.. మ్యాథ్స్‌ వస్తే పోటీ పరీక్షల్లో టాప్‌లో నిలవొచ్చుననే ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి పరీక్షలపై ఆసక్తి చూపించారు. మంగళవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ లెవల్‌–1 పరీక్షకు విశేష స్పందన వచ్చింది.

వివిధ కేటగిరీల్లో నిర్వహణ

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ లెవల్‌–1 పరీక్ష నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. అక్షర దోషాలు లేకుండా పదాలు రాయడం, కొత్త ఇంగ్లిష్‌ పదాలు, గణిత ఫార్ములాలు విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. కేటగిరీ–1లో భాగంగా ఒకటి, రెండో తరగతి, రెండో కేటగిరీలో మూడు, నాలుగో తరగతి, కేటగిరీ–3లో ఐదు నుంచి ఏడో తరగతి, కేటగిరీ–4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష తీరును ‘సాక్షి’ కరీంనగర్‌ యూనిట్‌ మేనేజర్‌ వైద శ్రీనివాస్‌, సాక్షి సిబ్బంది మహేందర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, మహేందర్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement