2.200 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

2.200 కిలోల గంజాయి పట్టివేత

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● ఇద్దరి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

● ఇద్దరి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

కొత్తపల్లి(కరీంనగర్‌): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.200 కిలోల గంజాయి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌ వివరాల మేరకు రేకుర్తికి చెందిన మహమ్మద్‌ మున్నా, మహమ్మద్‌ షారుక్‌ కొంతకాలంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి కరీంనగర్‌ తీసుకొస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విద్యార్థులు, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలోకు రూ.20 వేల చొప్పున 2.200 కిలోల గంజాయి కొనుగోలు చేసి రేకుర్తికి తీసుకొచ్చారు. కిలో గంజాయి రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యారు. రేకుర్తిలోని సమ్మక్క గద్దెల వద్ద మంగళవారం గంజాయి తీసుకెళ్తుండగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సై సాంబమూర్తి తనిఖీ చేశారు. సంచిలో గంజాయి, సెల్‌ఫోన్లు లభించగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement