నివారించగల అంధత్వాన్ని నివారించే లక్ష్యంతో లయన్స్ విజన్ కేర్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉచిత వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఉచిత రవాణా, భోజన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటివరకు 50,673 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాం.
– పూదరి దత్తాగౌడ్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పెద్దపల్లి
ఆధార్ ఉంటే ఉచితంగా ఆపరేషన్
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతీఒక్కరికి ఉచిత కంటిపరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్స సేవలు అందిస్తాం. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పేషెంట్లకు ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తాం. చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెల్దండి రఘు,
నేత్ర వైద్య నిపుణుడు, పెద్దపల్లి


