గేదెను ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

గేదెను ఢీకొని యువకుడి దుర్మరణం

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

కొడిమ్యాల: భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా.. అడ్డొచ్చిన గేదెను ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం మండలంలోని నాచుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాచుపల్లికి చెందిన జిట్టవే ణి మధుసూదన్‌ ఉపాధి నిమిత్తం సింగాపూర్‌ వెళ్లా డు. ఇటీవలే తిరిగొచ్చాడు. సుమారు 9 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. అనిత కరీంనగర్‌లో నర్సింగ్‌ కోర్స్‌ చేస్తుండడంతో ప్రతిరోజూ ఉదయం జగిత్యాల – కరీంనగర్‌ రహదారిపై ఉన్న దొంగలమర్రి వద్ద బస్సు ఎక్కించి.. సాయంత్రం తిరిగి తీసుకెళ్తుంటాడు. కళాశాల నుంచి దొంగలమర్రి స్టేజీ వద్ద దిగిన భార్యను తీసుకొచ్చేందుకు నాచుపల్లి నుంచి బయల్దేరాడు. రైల్వే ట్రాక్‌ బ్రిడ్జి సమీపంలో ఎదురుగా గేదె అడ్డు రావడంతో ఢీకొని కింద పడిపోయా డు. తలకు తీవ్ర గాయాలైన మధుసూదన్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మధుసూదన్‌ మృతితో నాచుపల్లిలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement