కొనసా.. గుతున్న వైద్య కళాశాల | - | Sakshi
Sakshi News home page

కొనసా.. గుతున్న వైద్య కళాశాల

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● సౌకర్యాలు లేక విద్యార్థినుల అవస్థలు ● ఆందోళన బాటలో మెడ్‌కోలు ● జగిత్యాల వైద్య కళాశాల పరిస్థితి

● సౌకర్యాలు లేక విద్యార్థినుల అవస్థలు ● ఆందోళన బాటలో మెడ్‌కోలు ● జగిత్యాల వైద్య కళాశాల పరిస్థితి

జగిత్యాల: జగిత్యాల జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల భవనం పూర్తి కాకపోవడంతో మెడ్‌కోలు ఇబ్బంది పడుతున్నారు. తమకు సౌకర్యాలు కల్పించాలని ఆందోళనబాట పడుతున్నారు. 2022లో మెడికల్‌ కళాశాల ప్రారంభమైంది. మూడు బ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాల్గో బ్యాచ్‌కు చేరింది. అయినా కళాశాల భవనం పూర్తికాకపోవడం.. ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో వసతులు, హాస్టల్‌ సక్రమంగా లేకపోవడంతో మెడ్‌కోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదైనా భవనం అందుబాటులోకి వస్తుందని ఎదురుచూస్తున్న మెడ్‌కోలకు ఇంకా తాత్కాలిక భవనాలే దిక్కయ్యాయి. గతంలో నిధులు లేక ఆగిపోయిన నిర్మాణాలకు ఇటీవలే నిధులు మంజూరు కావడంతో పనులు చేపడుతున్నారు. అయితే నెమ్మదిగా సాగుతుండడంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

తాత్కాలిక భవనంలోనే..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జగిత్యాలకు మెడికల్‌ కళాశాల మంజూరైంది. ధరూర్‌ క్యాంప్‌లోని ఆగ్రోస్‌ భవనం సమీపంలో సుమారు 27 ఎకరాలను కళాశాల నిర్మాణానికి కేటాయించారు. భవన నిర్మాణం, బాయ్స్‌హాస్టల్‌, గర్‌ల్స్‌ హాస్టల్‌ కోసం రూ.115 కోట్లు నిధులు విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి భవనాలకు భూమిపూజ చేశారు. తాత్కాలికంగా ఆగ్రోస్‌కు సంబంధించిన గోదాములను రెనోవేషన్‌ చేసి తరగతులు ప్రారంభించారు. ఇందుకు రూ.14 కోట్లు మంజూరు కాగా పనులను వెంటనే చేపట్టారు. ప్రస్తుతం అందులోనే క్లాసుల నిర్వహణ జరుగుతోంది. మెడికల్‌ కళాశాల, బాయ్స్‌, గర్‌ల్స్‌ హాస్టల్స్‌ కోసం విడుదలైన రూ.115కోట్లతో అప్పట్లోనే కాంట్రాక్టర్‌ రూ.65 కోట్ల వరకు పనులు చేపట్టారు. భవనానికి స్లాబ్‌, గోడలు పూర్తయ్యాయి. బాయ్స్‌ హాస్టల్‌, గర్‌ల్స్‌ హాస్టల్‌ నిర్మాణ దశలోనే ఉన్నాయి. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో భవన నిర్మాణం కొన్ని రోజులు నిలిచిపోయాయి.

విద్యార్థులకు ఇబ్బందులు

రూ.14 కోట్లతో రెనోవేషన్‌ చేపట్టి తరగతి గదులను ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన రీతిలో లేవు. అంతా చీకటిగా ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. బాయ్స్‌ హాస్టల్‌ ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో ఉండగా.. గర్‌ల్స్‌ హాస్టల్‌ మాత్రం నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న నర్సింగ్‌ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement