ఓట్ల తొలగింపుపై ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై ఆందోళనలు

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

సిరిసిల్లటౌన్‌: ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొఅన్నారు. సిరిసిల్ల కార్మిక భవనంలో బుధవారం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 22ఏ నిషేధిత భూముల విడుదల, ఆర్టీసీ ఎన్నికలు, పల్లగుట్ట పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కార్యాచరణ ప్రకటించారు. ఓట్లు తొలగించడం రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోందని ఆరోపించారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తెలంగాణలో 22–ఏ నిషేధిత జాబితాలో ఉన్న లక్షలాది ఎకరాల్లోని పేదల భూములను వెంటనే విముక్తం చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంద సుదర్శన్‌, జిల్లా పార్టీ కార్యదర్శి, నేతలు గుంటి వేణు, పంతం రవి, సోమ నాగరాజు, మంద అనిల్‌, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.

విలీనం ఐక్య కూటమితోనే సాధ్యం

సిరిసిల్ల అర్బన్‌: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత కావాలంటే ఐక్య కూటమితోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని ఆర్టీసీ బస్సు డిపోలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్యకూటమి బస్సు, నిచ్చెన గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు మంద సుదర్శన్‌, రాష్ట్ర నాయకులు గుంటి వేణు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కాళిదాస్‌, టీఎంయూ జిల్లా అధ్యక్షుడు జీపీ సింగ్‌, ఆకుల రమేశ్‌, జేఎస్‌ఎన్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement