కరీంనగర్‌సిటీ: పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఆర్థిక శాస్త్రంలో కంప్యూటర్ అనువర్తనాలు– విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు‘ అనే అంశంపై ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన ఒకరోజు కార్యశాల నిర్వహించారు. వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమన్నారు. రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థికశాస్త్ర విద్యార్థులకు ఆధునిక డిజి టల్ సాంకేతికతలను పరిచయం చేయడం ద్వారా పరిశోధన, డేటా విశ్లేషణలో ఎక్సెల్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చాని సూచించారు. వర్క్‌షాప్ కన్వీనర్ కె.శ్రీవాణి, ఓఎస్డీ డి.హరికాంత్, ఎన్‌వీ. శ్రీరంగప్రసాద్ పాల్గొన్నారు.


