రోగాలకు ‘ఓపెన్‌’ప్లాట్లు | - | Sakshi
Sakshi News home page

రోగాలకు ‘ఓపెన్‌’ప్లాట్లు

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

నివాసాల మధ్య మురికి కూపాలు

ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న వర్షపు నీళ్లు

చెత్తాచెదారం, వాన నీటితో దోమలు వృద్ధి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని నివాసగృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు రోగాలకు నిలయంగా మారాయి. చెత్తా చెదారం, పొదలు, పిచ్చిమొక్కలకు తోడు వర్షపునీళ్లు, డ్రైనేజీ నీరు చేరి ఇళ్ల మధ్యలో మురికికూపాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా దోమలు, పందులకు నిలయాలుగా మారుతున్నాయి. నగరంలోని అన్ని డివిజన్లలో నివాసాల మధ్యలోని ఖాళీ స్థలాలు ప్రమాదకరంగా మారాయి. ఖాళీ స్థలాలు అనగానే చెత్తాచెదారం వేయడం సమీప ప్రాంత వాసులకు అలవాటుగా మారింది. వర్షాకాలం కావడంతో పొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి కొన్ని చోట్ల అర్బన్‌ మినీ ఫారెస్ట్‌లను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక, మురుగునీరు ఖాళీ స్థలాలకు చేరుతోంది. వర్షపు నీళ్లు కూడా ఇందులోనే నిలిచిపోతున్నాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో సమీపప్రాంత వాసులు త్వరగా రోగాల బారినపడుతున్నారు. కాగా సీజన్‌ కావడంతో నగరపాలక సంస్థ షెడ్యూల్‌ ప్రకారం డివిజన్‌ల వారీగా ఫాగింగ్‌ చేపడుతోంది. ఈ ఫాగింగ్‌ను మరింత పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.

హౌసింగ్‌ బోర్డుకాలనీలో ఇళ్ల మధ్య..

సుభాష్‌నగర్‌లో చెత్త కుప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement