చొప్పదండి: పట్టణంలోని అంగడి బజార్‌లో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎస్‌బీఎం 2.0 అర్బన్ పథకం నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన అస్పిరేషన్ టాయిలెట్లను బుధవారం మున్సిపల్ పాలకవర్గం, అధికారులు అట్టహాసంగా ప్రారంభించారు. 24 గంటలు గడవకముందే గురువారం టాయిలెట్లకు తాళం వేసి ఉండడం చర్చనీయాంశమైంది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినవారు రెండు టాయిలెట్లకు తాళం వేసి ఉండడం చూసి ముక్కున వేలేసుకున్నారు. ‘అస్పిరేషన్ టాయిలెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రస్తుతం మార్కెట్ చౌరస్తాలో ఉన్న టాయిలెట్ల లాగే వీటిని నిర్వాహకులకు అప్పగించాల్సి ఉంది. టాయిలెట్ల సమయపాలనపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు’. అని మున్సిపల్ కమిషనర్ నాగరాజు వివరించారు.


