భగత్‌నగర్‌ దోపిడీ కేసుపై డీఐజీ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

భగత్‌నగర్‌ దోపిడీ కేసుపై డీఐజీ సీరియస్‌

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను గురువారం డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్‌ గురువారం సందర్శించారు. మంగళవారం అర్ధరాత్రి భగత్‌నగర్‌లో జరిగిన దోపిడీ ఘటనపై సమీక్ష నిర్వహించారు. కేసు పురోగతిపై సీపీ గౌస్‌ ఆలంను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా అరెస్టు చేయాలని ఆదేశించారు. అనంతరం డీజీపీ నిర్వహించిన సైబర్‌ నేరాల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. డీఐజీ కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించారు. పెండింగ్‌ ఫైళ్లు, కేసుల పురోగతిని సమీక్షించారు. డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్‌ కౌసల్య, సీసీ వేణు పాల్గొన్నారు.

నేటి నుంచి సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 ఖోఖో పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అండర్‌–14, 17, 19 బాలికల ఖోఖో చాంపియన్‌షిప్‌ నిర్వహణకు కరీంనగర్‌ కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఈ– టెక్నో స్కూల్‌ సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు జరిగే ఈ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అల్ఫోర్స్‌ అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సా యంత్రం ఖోఖో సంఘం ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అండర్‌–14 విభాగంలో 87 జట్లు, అండర్‌–17లో 55 జట్లు, అండర్‌–19లో 13 జట్లు హాజరుకానున్నట్లు తెలిపారు. నేడు ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి చొప్పదండి ఎమ్మె ల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీబీఎస్‌ఈ రీజినల్‌ ఆఫీసర్‌ జంగం సునీల్‌ కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజ రుకానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ రెఫరీ బోర్డు కన్వీనర్‌ వంగపల్లి సూర్య ప్రకాశ్‌, ఖోఖో ఇంటర్నేషనల్‌ రెఫరీ ఏ.రవీందర్‌ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

కరీంనగర్‌సిటీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్‌, మానకొండూరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చెన్నమల్ల చైతన్య, టీఆర్‌ఎస్వీ ఎస్‌యూ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం యూనివర్సిటీ ఎదుట నిరాహాక దీక్ష చేపట్టారు. చైతన్య మాట్లాడుతూ.. నీట్‌ను పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందన్నారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ కావడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహిస్తూ రాజీనా మా చేయాలని విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగాలిచ్చ్చే స్థాయికి ఎదగాలి

కరీంనగర్‌సిటీ: డిగ్రీ విద్యార్థులు నూతన ఆలో చనలు, సృజనాత్మక పద్ధతులతో వ్యాపార పారిశ్రామిక సంస్థలను స్థాపించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేస్థాయికి ఎదగా లని ఎస్సారార్‌ ప్రభుత్వ అటనామస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కల్వకుంట రామకృష్ణ సూచించా రు. కళాశాల బీబీఏ విద్యార్థులకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ స్టార్ట్‌అప్‌ ఎకో సిస్టం ఫ్రం ఐడియాస్‌ టు ఎంటర్ర్‌పైస్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యవస్థాపకత అభివృద్ధి కార్యశాల గురువారం ముగిసింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీస్థాయి నుండే తమ వినూత్న ఆలోచనలతో ఉద్యోగ అవకాశాలను కల్పించేస్థాయికి ఎదగాలన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.రాజయ్య, చా ర్టెడ్‌ అకౌంటెంట్‌ ముక్క హరీశ్‌ బాబు, జి.సురేందర్‌, జీ.వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి, కార్యశా ల సమన్వయకర్త హర్‌జ్యోత్‌ కౌర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement