రామగుండం: కాజీపేట–బల్హర్షా గ్రాండ్ ట్రంక్ రూట్‌లో దశాబ్దకాలం వ్యవధిలో మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులను ఈనెల 22వ తేదీన పూర్తి చేసి కమిషనర్ ఆఫ్ రైల్వే సెఫ్టీ మాధవి, డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ సమక్షంలో ట్రయల్‌రన్ నిర్వహించిన మీదట పూర్తిస్థాయి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో కాజీపేట–బల్హర్ష మధ్య 203 కి.మీ.దూరంలో ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయి. 203 కిలోమీటర్లు రూ.3,000 వేల కోట్ల వ్యయంతో నిర్మించే మూడో రైల్వేలైన్ రాష్ట్ర పరిధిలో 159 కి.మీ., మహారాష్ట్ర పరిధిలో 44 కి.మీ ఉంది. కాగా తొలుత 2016లో ట్రిప్లింగ్ పనులు ప్రారంభించి రాఘవపురం–మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల వ్యవధిలో ట్రిప్లింగ్ పనులు అదే ఏడాది పూర్తి చేశారు. ఈ క్రమంలో దశల వారీగా విభాగాలుగా పనులు నిర్వహిస్తూ ఈనెల 22న చివరగా ఆసిఫాబాద్‌రోడ్–కాగజ్‌నగర్ మధ్యలో పెద్దవాగు బిబ్రానది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పరిశీలించిన మీదట రైల్వే ఉన్నతాధికారుల బృందం పచ్చ జెండా ఊపడంతో గ్రాంట్ రూట్‌లో మూడవ రైల్వే లైన్ ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
కాజీపేట–బల్హార్ష రూట్‌లో రైల్వే ట్రాక్ రన్నింగ్ సామర్థ్యం 130 కిలోమీటర్లు


