తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం బియ్యాల సమ్మయ్య ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని, బాధితులు కాల్వశ్రీరాంపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గంజాయి పట్టివేత

బుగ్గారం: మండలంలోని క్రాస్‌ రోడ్డు సమీపంలో గురువారం 60 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలకేంద్రానికి చెందిన కొండవేణి రాజ్‌కుమార్‌ అనే యువకుడు గంజాయితో పట్టుబడినట్లు ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. నిందితుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏపీఏ గనిలో ప్రమాదం.. కాంట్రాక్ట్‌ కార్మికుడికి తీవ్ర గాయాలు

రామగిరి: ఏపీఏ గనిలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. వెన్సర్‌ కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుడు గుంట మల్లేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో 3వ సిమ్‌లో రూఫ్‌ బోల్ట్‌ ఏర్పాటు చేస్తున్న సమయంలో యంత్రానికి సంబంధించిన బిట్‌ విరిగి మల్లేశ్‌ తలపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను ఆర్జీ–3 ఏరియా సెంటినరికాలనీ డీస్పెన్సరికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మల్లేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement