ఒకేరోజు.. నాలుగు చోరీలు
కరీంనగర్, వేములవాడలో రెండు చొప్పున ఘటనలు
తుపాకీతో బెదిరించి.. బంధించి నగరంలో అర్ధరాత్రి భారీ దోపిడీ
54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు అపహరణ
పట్టపగలే తాళం వేసిఉన్న ఇంట్లోంచి రూ.4.80 లక్షల నగదు..
వేములవాడలో బైక్‌నుంచి 3 నిమిషాల్లో రూ.3.50 లక్షలు మాయం
జాతర గ్రౌండ్‌లో ఆరు షాపుల్లో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, వేములవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ ఘటన మరవక ముందే నగరం మరోసారి ఉలిక్కి పడింది. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లోవారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు అపహరించారు. ఇంటి ఎదుట పార్క్‌చేసి ఉన్న రెండు బైక్‌లను తీసుకుని పరారయ్యారు. బుధవారం బైక్‌లను హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నగరంలోని వావిలాలపల్లి తులసీనగర్‌లో పగటి పూట ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు రూ.4.80 లక్షలు అపహరించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వేములవాడ జాతరగ్రౌండ్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. ఆషాఢ మాసం నేపథ్యంలో మూసివేసి ఉన్న డేరా షాపులను లక్ష్యంగా చేసుకుని ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. – వివరాలు 8లోu


