సిరిసిల్ల: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఆదివారం రాత్రి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం(ఈటీసీఏ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అజ్మాన్‌లోని హ్యాబిటెట్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో 250 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ అస్థిత్వ వేదిక చైర్మన్, తెలంగాణ ఉద్యమ నాయకులు వి.ప్రకాశ్ హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈటీసీఏ ఫౌండర్ కిరణ్‌కుమార్ పీచర, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, ప్రతినిధులు రాజ శ్రీనివాసరావు, ఎస్‌వీఎస్ రెడ్డి, రవి కటుకం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అలిగేటి, జాయింట్ సెక్రటరీ శేఖర్‌గౌడ్, కోశాధికారి తిరుమల్‌రావు, కల్చరల్ సెక్రటరీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల కళారూపాలు, వేషధారణలు, నృత్యాలు అలరించాయి.


