● చిన్నారుల్లో కళా నైపుణ్యాల రూపం ● బాలభవన్‌లో వికసిస్తున్న సృజనాత్మక ప్రతిభ
కరీంనగర్‌కల్చరల్: వేసవి సెలవులు సరదాగా గడపడమే కాకుండా తమలోని సృజనాత్మకతకు పదును పెడుతూ చిన్నారులు కళారంగంలో నైపుణ్యాలు సొంతం చేసుకుంటున్నారు. నగరంలోని బాలభవన్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లో ఆర్ట్ అండ్‌క్రాస్ట్, మెహందీ, పెయింటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. పేపర్‌తో అందమైన తోరణాలు, రంగురంగుల పూల తయారీ, పాట్ పెయింటింగ్, వాల్ డిజైనింగ్ నేర్పిస్తున్నారు. సాధారణ వస్తువులతో అందమైన అలంకరణ వస్తువులు తయారు చేయడం చిన్నారుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తోంది. మరోవైపు మెహందీలో డిజైన్లను నేర్చుకుంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
నేను బాల భవన్‌లో టైలరింగ్, మెహందీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, కుట్లు, అలికలు, టైలరింగ్, బ్యూటీషియన్, వేస్ట్ మెటీరియల్ తోటి అందమైన వస్తువుల తయారీ చేయడంలో తర్ఫీదు ఇస్తున్నా. పిల్లలు ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నారు. మంచి మంచి వస్తువులు తయారు చేసి చూపిస్తున్నారు.
– పెందోట సూర్యశ్రీ, శిక్షకురాలు
నేను కుట్లు, అలికలు, సంగీతం, మెహందీ నేర్చుకుంటున్నాను. ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ఈ నాకు బేసిక్స్ ఉపయోగపడతాయి. ప్రతి విషయం వివరంగా అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు చక్కగా నేర్చుకుంటున్నాను.
– సిద్దితా శ్రేయన్


