జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త, మహిళల అత్యుత్తమ విజయాలను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక నారీ శక్తి అవార్డు– 2026ను తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ అందుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను సత్కరించారు. రామగుండంకు చెందిన రష్మీఠాకూర్ ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పోచంపల్లి ఇక్కత్ సారీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్నారు.


