నేటి సమాజంలో మొబైల్ ఫోన్‌కు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వట్లేదు. మొబైల్ ఫోన్ ఉంటే ఏదైనా చేయవచ్చు.. ఏదైనా సాధించొచ్చు అనే ఊహలో బతికేస్తున్నాం మనం. మన ప్రతీ పనిలో మొబైల్ భాగమైపోయింది. ఈ మొబైల్ ఒక కుటుంబంలో ఆనందాన్ని నింపితే.. మరో కుటుంబంలో మంటలు రాజేస్తూ విషాదాలు నింపుతుంది. ఈ ఫోనే భౌతిక బంధాలను దూరం చేస్తుంది. సాటి మనిషిని కలవకుండా చేస్తుంది. నీ ఫోన్‌ను బంగారు భవిష్యత్ కోసం వినియోగించుకుంటావో? అనవసరమైన మనుషుల కోసం జీవితాన్ని భారంగా మలచుకుంటావో? నీ చేతుల్లోనే ఉంది సోదరా..
మోటె శివకుమార్
గ్రామం:
కాకునూరు
జిల్లా: రంగారెడ్డి


