బాబు జగ్జీవన్‌రామ్ చంద్ర గ్రామంలో పుట్టాడు
సామాజిక న్యాయంకై పోరాటం తలుపు తట్టాడు
కనీస వేతన చట్టాన్ని ప్రవేశపెట్టిన దళిత నేత
హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ప్రఖ్యాత !
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినవాడు
స్వాతంత్య్ర సమరంలో నిలిచి గెలిచిన రేడు
భారత్‌లో బాబూజీగా తాను ప్రసిద్ధుడు
సమసమాజ స్థాపనకు తానాయే సంసిద్ధుడు !
హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి
కుల రహిత సమాజ ప్రాకారం కట్టి
కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ పార్టీని పెట్టి
జగత్ ప్రఖ్యాతి గాంచిన జగజ్జెట్టి
స్వయం పోరాటం చేసి ఎదిగిన రాజకీయవేత్త
దళితుల పోరాటంలో చూపించెను తన సత్తా
ఆయన హృదయం నవనీతం కన్నా మెత్త
పోరు సల్పిన అందరికీ పంచె సమన్యాయం బత్త !
పోరాటాలకు ఆయన ఓ వెన్నెముక
ఆరిపోని నిరంతరం మండే ఓ అగ్నిశిఖ
సేవారంగంలో చూపించను తన తడాఖ
గాంధీజీ నేతాజీలకు తానాయెను ప్రియ సఖ !
శోభిరామ్ వసంత దేవిల కుమారుడు
1986 జూలై నెలలో అయ్యాడు అమరుడు
అమరుడైన బాబూజీకి ఇవ్వాలి నివాళి
అంజలి ఘటించి చదువుదాం కావాలి !
గుర్రాల లక్ష్మారెడ్డి
కవి, రచయిత
కల్వకుర్తి
నాగర్ కర్నూల్ (జిల్లా)


