తంగళ్లపల్లి(సిరిసిల్ల): సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు పుత్రశోకం కలిగింది. అనారోగ్యంతో కుమారుడు అశ్విన్‌రావు ఆదివారం మృతిచెందాడు. దీంతో జిల్లా కేంద్రం సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలంలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల సెస్‌చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్‌రావు(36) కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రక్తపోటు అధికం కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. కుమారుడి మరణంతో చిక్కాల రామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చికిత్సను అందించారు. అశ్విన్‌రావు అంత్యక్రియలు సోమవారం సిరిసిల్లలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాష్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు.
అవయవదానం..
అశ్విన్‌రావు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆపదలో ఉన్న నలుగురికి ప్రాణదానం చేశారు.
చిక్కాల అశ్విన్‌రావు బ్రెయిన్‌డెడ్
అవయవదానంతో నలుగురికి ప్రాణదానం


