మస్కట్‌లో ఇబ్రహీంపట్నం వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

మస్కట్‌లో ఇబ్రహీంపట్నం వాసి మృతి

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

మస్కట్‌లో ఇబ్రహీంపట్నం వాసి మృతి రైలు నుంచి జారిపడి యువకుడు..

ఇబ్రహీంపట్నం: జీవనోపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్లిన మండలకేంద్రానికి చెందిన జంగోని రవీందర్‌ (48) రెండు రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపా రు. రవీందర్‌ 20 ఏళ్ల క్రితం మస్కట్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్రక్‌ను నడుపుతూ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. రవీందర్‌కు భార్య లావణ్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

ఖిలా వరంగల్‌: రైలు నుంచి జారి పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆది వారం వరంగల్‌– చింతలపల్లి రైల్వేస్టేషన్‌ మ ధ్య జరిగింది. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తికి చెందిన పర్లపల్లి శ్రీకాంత్‌ (30) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మణుగూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ రంగల్‌ –చింతలపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య జారి ప డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద లభించిన పగిలిపోయిన మొబైల్‌లోని సిమ్‌నంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని తండ్రి అయిలయ్యకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement