క్షీరము నిచ్చేది ధేనువు
జ్ఞానము నిచ్చేది గురువు
దేవ గురువు బృహస్పతి
గురుదేవుడెప్పుడూ సరస్వతే!!
అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేది గురువు
మంచి మనిషిగా తీర్చిదిద్దేది గురువు
మంచిని బోధించేది గురువు
గురువు లేని విద్య గుడ్డి విద్య!!
విజ్ఞానం పంచేది గురువు
తన విద్యను దారపోసేది గురువు
ప్రపంచంలో అన్నిటికీ రెండు కొమ్ములే ఉంటే
మూడు కొమ్ములు ఉన్నవాడు గురువు!!
గు=1 రు =2 వు =3
దేవులపల్లి రమేశ్
నంగునూర్,
సిద్దిపేట జిల్లా


