మధుర జ్ఞాపకాల బాల్యం | - | Sakshi
Sakshi News home page

మధుర జ్ఞాపకాల బాల్యం

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

ఎక్కడ చూసినా అదే

ఎవరి చేతిలోనైన అదే

ఏది చేసిన అదే

మంచి చెడుకు అదే

విచ్చలవిడిగా అదే

ఎవరి చేతిలోనైనా అదే

అదే ఓ ప్రపంచంగా మారిపోయింది

అది లేని మనుజుడు లేడు

అది లేని ఇల్లు లేదు

ఏమి చేయాలన్న దానితోనే

కష్ట సుఖాలు దానితోటి

పిల్లల చేతుల్లో అదే

పెద్దల వద్ద అదే

భోజనం చేసేటప్పుడు అదే

నిద్రించేటప్పుడు అదే

పసిపిల్లలను లాలిస్తుంది

పిల్లలు ఏడిస్తే అదిస్తే బుజ్జగిస్తుంది

పెద్దలకి లోకం అదే

చిన్నలకు అమ్మ అదే

దానితోనీ ఉపయోగం కన్న

అది చేసే కీడే ఎక్కువ

దానితో అనారోగ్యం వస్తుంది

అదే అందరికీ మంచి స్నేహం

అది లేకుంటే ఏడుస్తారు పిల్లలు

దానితో వస్తుంది కళ్ల రోగం

అది లేకుంటే పడుకోరు

అది లేకుంటే తినరు పిల్లలు.

అందరితో మాట్లాడాలన్న అదే

ఎవరిని కలవాలన్న అదే

అది లేకుంటే పరువుపోతుందని ముసలి వాళ్లు కూడా కొంటున్నారు

నియంత్రించాలి ఈ చరవాణి వినియోగం

తగ్గించాలి ఈ సెల్‌ఫోన్‌ ప్రపంచం

ఎన్‌.శ్రీకర్‌

ఊటూరు

మానకొండూర్‌

కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement