‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’
ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ.
తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు.
‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య.
జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు.
స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’
తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’
చుక్క అడిగింది: ‘మరి చిప్స్‌లో ఏముంది?’
తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’
రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’
తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’
బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’
పిల్లలకి మాట :
ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు.
నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం
డాక్టర్ కోట లక్ష్మణ్
ప్రభుత్వ ఉపాధ్యాయులు
గ్రామం: కాకర్లపల్లి, మంథని
జిల్లా: పెద్దపల్లి


