కరీంనగర్: పొగాకు నియంత్రణ చట్టం (కా ట్పా–2003)ను సమర్థవంతంగా అమలు చేసి ‘టొబాకో ఫ్రీ జిల్లా’గా మార్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాట్పా చట్టంలోని కీలక నిబంధనలు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై ఆంక్షలు, మైనర్లకు విక్రయాల నిషేధం, విద్యాసంస్థల 100 గజాల పరిధిలో అమ్మకాల నిషేధం, ఆరోగ్య హెచ్చరికల ముద్రణ వంటి అంశాలను వివరించారు. ప్రతి నెల టాస్క్‌ఫోర్స్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విప్లవశ్రీ, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ పోచయ్య పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఉద్యమంలా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో డీఈవో ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో మాట్లాడు తూ బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమ య్యే నాటికి అవసర మైన సౌకర్యాలు కల్పించాలని ఎంఈవోలకు సూచించారు. డీఆర్‌డీవో గీత, డీపీవో జగదీశ్వర్, డీడబ్ల్యూవో సరస్వతి, జెడ్పీ సీఈవో పవన్ కుమార్ పాల్గొన్నారు.
బడిబాట పోస్టర్ ఆవిష్కరణ
సప్తగిరికాలనీ(కరీంనగర్): మంకమ్మతోటలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్‌వాడీలో డీఈవో ప్రశాంత్ రెడ్డి బడిబాట వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయురా లు ప్రమోద, జిల్లా సైన్స్ అధికారి జైుపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు మాగంటి శ్రీనివాస్, జ్యోతి, రాజేశ్, శ్రీధర్‌రెడ్డి, సాయి పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారి (ఎన్‌హెచ్–563) విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలను పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్‌లో మాట్లాడుతూ 2016–19 కాలంలోనే అప్పటి సీఎం కేసీఆర్, ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో ఎన్‌హెచ్–563 మంజూరైందన్న విషయాన్ని గుర్తు చేశారు. 2019లోనే కేంద్రం ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా ప్రచారం చేయ డం ప్రజలను మోసం చేయడమే అన్నారు. టీఆర్‌ఎస్ హయాంలోనే 60 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 40 శాతం భూసేకరణ పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తీగలగుట్టపల్లి వద్ద నాలుగేళ్లుగా ఆర్‌వోబీ నిర్మాణం పూర్తి కాలేదని, కొండగట్టు అభివృద్ధికి ఒక్క రూపాయి నిఽ దులు తేలేదని విమర్శించారు. పొన్నం అనిల్‌కుమార్, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: గురువారం రాత్రి జిల్లాలో కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ చిత్రామిశ్రా తెలి పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో కొంత ధాన్యం తడిసిందని అన్నా రు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని వెల్లడించారు.
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఆర్డీవోగా ఎం.షర్మిలను నియమిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె హెచ్‌ఎండీఏ పని చేశా రు. తాజాగా ప్రభుత్వం కరీంనగర్ ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


